చెరువుమాదారం నుంచి పాదయాత్ర ప్రారంభం

ఖమ్మం, 24 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం నాడు 130వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం ఆమె చెరువు మాదారం నుంచి యాత్రను ప్రారంభించారు. నేలకొండపల్లి మండలం అజయ్‌తండా, భైరవునిపల్లి క్రాస్‌రోడ్డు, తిరుమలాపురం, కొత్తకొత్తూరు, నేలకొండపల్లి,గువ్వలగూడెం, ముది గొండ మండలం గోకినేపల్లి వరకు సాగనుంది. ఇక్కడే శ్రీమతి షర్మిల రాత్రి బస చేస్తారు.

Back to Top