హైదరాబాద్ : అదిగదిగో రాజధాని అంటూ చంద్రబాబు చెబుతున్న కాకి లెక్కలపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ప్రధానమంత్రితో బాబు సమావేశం మీద పచ్చ మీడియా చాలా ప్రచారం చేసింది. కానీ అసలు విషయం మాత్రం నెమ్మదిగా బయటకు వచ్చింది.కొత్త రాజధాని పేరుతో చంద్రబాబు చెప్పిన లెక్కల్ని అక్కడ ప్రధానమంత్రి తప్పు పట్టినట్లు తెలుస్తోంది. 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి 50వేల ఎకరాల్లో రాజధాని అనవసరం అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. పైగా అక్కడ భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొంటే ఇప్పటికిప్పుడు ఇన్ని భవంతులు అవసరమా అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఆస్పత్రుల కోసమో, విద్యావకాశాల కోసమో, పరిశ్రమల్లో ఉపాధి కోసమో అయితే ప్రజలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొంటారు కానీ, ఈ రీతిన నిర్మాణాలు చేసుకొంటే ప్రజలు ఎందుకు వస్తారని అడిగినట్లు తెలుస్తోంది. కేవల పరిపాలనపరమైన కార్యాలయాలు అంటే మాత్రం 5,6 గంటల్లో రాజధానిని చేరుకొనే వెసులుబాటు ఉంటే అక్కడ స్థిర నివాసాల కోసం ప్రయత్నించరని సున్నితంగా హెచ్చరించినట్లు వినికిడి. దీన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణాన్ని విజ్ఞత గలిగిన వారు ఎవరైనా తప్పు పడతారు అన్న సంగతి అర్థం అవుతోంది. కలలు కనండి అని అబ్దుల్ కలాం గారు చెప్పింది పగటికలల గురించి కాదు అని గుర్తించుకొంటే మేలు..!