పాలనకు చంద్రగ్రహణం పట్టింది.

గూడురు (నెల్లూరు)

: రాష్ట్ర పాలనకు చంద్రగ్రహణం పట్టిందని, అది గుడూరు ప్రాంతంలోని పరిస్థితులను చూస్తే స్పష్టంగా తెలుస్తుందని ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న  వారంతా పైనుంచి కింది వరకు పని చేయాలంటే నా కెంతి స్తావ్‌ అంటూ మేయడమే కార్యక్రమంగా పనిచేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో ఉన్నది టిడిపి మంత్రివర్గమా మరేదైనా  అంటూ చంద్రబాబు వైఖరిని నిశితంగా విమర్శించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుడూరు కోర్టు సెంటర్ లో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన తీరును నిశింతగా విమర్శిస్తూ, జరుగుతున్న అక్రమాలను అండగట్టారు. ఇటువంటి పాలన పోయి, రాజకీయాల్లో విశ్వసనీయతను తీసుకురావడానికి తనకు తోడుగా ఉండి, ఆశీర్వదించి ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  కిక్కిరిన జనసమూహాన్ని ఉద్దేశించిన వైయస్‌ జగన్‌  చేసిన ప్రసంగంలోని ప్రధాన అంశాలివి.

గుడూరు నియోజకవర్గంలో అడుగులో అడుగు వేస్తున్నప్పుడు చాలా మంది తన వద్దకు వచ్చారని, వారిలో చదువుకున్న యువత వచ్చి ఉద్యోగాలు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఉద్యోగం కోసం చదువుకున్నా ఎక్కడికి పోవాలో అర్ధం కావాడం లేదంటూ, పక్కనే ఉన్న దుగరాజపట్నం పోర్టు ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియడం లేదంటూ యువత చెప్పినట్లు తెలిపారు.



రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 2018 కల్లా దాని మొదటి దశను ఫూర్తి చేస్తి ఇస్తామంటూ చట్టంలో స్ఫష్టంగా చెపితే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాత్రం దుగరాజపట్నం కట్టకపోయినా ఫరవాలేదంటూ కేంద్రానికి లేఖ రాశారని జననేత అన్నారు.అసలు దుగరాజపట్నం పోర్టు వద్దనడానికి చంద్రబాబు ఎవరన్నా అంటూ తనను యువత ప్రశ్నిస్తున్నారని అన్నారు. అలాగే మా ఉపాథి అవకాశాలు మెరుగుపడేందుకు ఉపయోగపడే ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు ఎలా వద్దంటారన్నా  అంటూ తనను పాదయాత్రలో గుడూరు ప్రాంతానికి చెందిన వారు అడిగారని చెప్పారు

నెల్లూరు జిల్లా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. రాష్ట్రానికి ‘చంద్ర’గ్రహణం పట్టింది. కృష్ణపట్నం పోర్టును చూస్తే మనందరికీ మహానేత వైయస్‌ఆర్‌ గుర్తొస్తారు. గతంలో తొమ్మిదేళ్లలో బాబు చేయలేదని కేవలం ఐదేళ్లలో ఆయన  చూపించరన్నారు. కృష్ణపట్నం పోర్టును కట్టించి, స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూశారు. ఆయన పోయిన తర్వాత మళ్లీ పరిస్థితి దారుణంగా తయారైందంటూ పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించారు.
గూడురు మున్సిపాలిటీలో మంచినీటికి కటకటలాడాల్సిన పరిస్థితిల్లో కండలేరు నుంచి గూడురు పట్టణానికి వైయస్‌ఆర్‌ మంచినీరు అందించేందుకు  63 కోట్ల వ్యయంతో పైప్ లైన్ లను నిర్మిస్తే, ఇప్పుడు వాటి నుంచి నీటిని కూడా  ఇవ్వని పాలన మనకు కనిపిస్తోందన్నారు. అలాగే గూడురులోనే వైయస్ ఆర్ గారి హాయంలో ప్రారంభమైన  పాత,కొత్త టౌన్లను కలిపే ఫ్లైఓవర్ నిర్మాణపు పనులు 4 ఏళ్లుగా పూర్తిగా ఆగిపోయాయన్నారు.

పండించడానికి,అమ్ముకునేందుకు రైతులు కుస్తీలు పడాల్సిన దుస్థితి

 నియోజకవర్గంలో నిమ్మపంట అధికంగా వేస్తారు. దాదాపు 40 వేల ఎకరాల్లో నిమ్మపంట వేస్తున్న రైతుల బాధలు వర్ణనాతీతం. 80 కేజీల నిమ్మకాయలు 500లకు కొనుగోలు చేస్తున్నారు. మేం ఎలా బ్రతకాలి? అని రైతులు అడుగుతున్నారు. సరుగుడు పంట రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందంటూ జననేత అన్నారు.
పంట పండించేందుకు, అమ్ముకునేందుకు రైతులు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతంలో రైతుల పరిస్థితులు బాధను కలుగజేస్తున్నాయి.

పేదల ఇళ్ల నిర్మాణంలోనూ లంచాలే

నాకు లంచం ఎంతిస్తున్నారు అనే పరిస్థితిలో చంద్రబాబు పాలన ఉంది. గూడురు పక్కనే ఉన్న బుర్రిపాలెంలో పక్కన పేదలకు ఇళ్లట. మూడు వందల అడుగుల్లో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని ఊదరగొట్టారు. అడుగుకు ఖర్చు రూ. 2 వేలట. అప్పుడు పేదవాడు ఇంటి కోసం ఆరు లక్షలు కట్టాలి. అదే ఫ్లాట్‌కు అడుగుకు రూ. వెయ్యి కంటే ఎక్కువ కాదు. ఈ ఫ్లాట్స్‌లో ప్రత్యేక వసతులు ఏమీ కల్పించడం లేదు. మార్చుల్స్‌ లేవు. లిఫ్ట్‌లు లేవు. ఏమీ లేని వాటికి అడుగుకు రూ. 850 నుంచి 900 వరకూ మాత్రమే ఖర్చు అవుతుంది. అలాంటిది రూ. 2 వేలు అంటున్నారు. మొత్తం ఆరు లక్షల్లో ఒకటిన్నర లక్ష కేంద్ర ప్రభుత్వం, ఒకటిన్నర లక్ష రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగతాది 20 ఏళ్ల పాటు నెలకూ రూ. 3వేల చొప్పున పేదవాడు చంద్రబాబు లంచాలకు కట్టాలి. చంద్రబాబు నిర్మిస్తున్న ఇళ్ల పక్కనే ఇందిరమ్మ గృహాలు కనిపిస్తాయి. ప్రతి పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు.’ ఇది పేదలపై చంద్రబాబుకు , దివంగత నేత వైయస్ఆర్ కు ఉన్న ప్రత్యక్ష తార్కాణాలని జగన్ అన్నారు.
గూడురు ప్రాంతంలోని ప్రత్యక్ష్యంగా మీరు చూస్తున్న అంశాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పాలన తీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని ప్రజలను కోరారు. 

ఎన్నికలకు ముందు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయనీ, తాను అధికారంలోకి వస్తే వాటిని తగ్గిస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చి మూడుసార్లు ధరలుపెంచి భారం మోపి ఈ రోజు కరెంటు స్విచ్ వేయాలంటే కూడా షాక్ కొట్టే పరిస్థితులు తీసుకువచ్చారని చంద్రబాబు తీరును ఎండగట్టారు. మాటపై నిలవని నైజాన్ని ప్రజలకు వివరించారు.
2014 కు ముందు 50, 100 వచ్చే బిల్లులు ఇప్పుడు 500, 1000 కు పెరిగిపోయాయన్నారు.వీటితోపాటు కరెంటోళ్లు వచ్చి ఇంట్లో ఉన్న వాటిని లెక్కవేస్తూ ఏవో లెక్కలుచూపుతూ 5, 10 వేల వరకు పెనాల్టీలు విధిస్తూ దారుణంగా చంద్రబాబు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
ఇంతే కాకుండా పొరుగు న ఉన్న కర్నాటక, తమిళనాడు కన్నా 6,7 రూపాయల కంటే ఎక్కువ ధరకలు పెట్రోలు, డీజిల్ ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాదుడు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 

చంద్రబాబు అధికారంలోకి రాకమునుపు రేషన్ షాపుల్లో వివిధ రకాల వస్తువులు పేదలకు,సాామాన్యులకు అందుబాటులో ఉంటే, ఇప్పుడు బియ్యం తప్ప మరేమీ లభించని స్థితిని తీసుకురావడమే కాకుండా, వాటిలోకూడా కటింగ్ పెడుతూ బియ్యాన్ని కూడా మిగుల్చుకుంటున్నారన్నారు.

చంద్రాబబు హైటెక్ పాలనలో మందు షాపుకు ఫోన్ చేస్తే ఇంటికే సప్లయి చేస్తున్నారని, ఏటా 15 శాతం మద్యంపై ఆదాయాన్ని పెంచుకుంటున్నారన్నారు.  బ్యాంకుల్లో  పెట్టిన బంగారం ఇంటికి రాావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ ప్రచారం చేసుకుని, 86 వేలకోట్ల పైచిలుకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని , ఇవి జరిగాయా అంటూ ప్రజలను ప్రశ్నించారు. బ్యాంకుల్లోపెట్టిన బంగారం రాకపోగా, బ్యాంకుల నుంచి వేలంనోటీసులు మాత్రం వస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. 
 జాబు కావాలంటే బాబు రావాలంటూ , జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా ప్రతి ఇంటికీ ఇంతవరకు దాదాపు 90 వేల వరకు బాకీ  పడ్డారని,  వాటి సంగతి ఏమటిని చంద్రబాబును ప్రశ్నించాలన్నారు.
 పొదుపు సంఘల అక్కెచెల్లెమ్మలు గురించి ఏమన్నాడు, రుణాలు మాఫీ కావాలంటే తానే ముఖ్యమంత్రికావాలని చెప్పుకుని నాలుగేళ్లలో ఒక్క రూపాయైనా మాఫీ చేయలేదని ఇలా చెప్పుకుంటే  బాబు వైఫల్యాలకు అంతే లేదన్నారు. 

లంచాలు ఎలా  మేయాలనే పైనే దృష్టి

చంద్రబాబు పాలనలో మంచి జరగకపోగా, పైనుంచి కింది వరకు ఎలా లంచాలు మేయాలనే దిక్కుమాలిన ఆలోచనలతోనే పాలన  జరుగుతోందని తీవ్రంగా ఆక్షేపించారు. ఇసుక , మట్టి , బొగ్గు వంటి వాటితో పాటు గుడి భూములను వదలకుండా అక్రమాలకు పాల్పడుతూ, గ్రామాల మీద పడి మేయడానికి జన్మభూమి కమీటీలను వేశారని వైయస్ జగన్ విమర్శించారు. పేదలకు ఫించను కావాలన్నా, రేషన్ కావాలన్నా చివరకు మరుగుదొడ్లు కావాలన్న లంచం అడుగుతున్నారన్నారు.

రాష్ట్రంలో ఉన్నది టిడిపి  మంత్రివర్గమేనా...

రాష్ట్రంలో ఎక్కడా మంచి జరగడం లేదనీఎమ్మెల్యేలను విచ్చలవిడిగా 20, 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, వారు రాజీనామాలు చేయరనీ, వారిపై అనర్హత వేటు వేయరని అన్నారు.  వారికి రక్షణ కల్పిస్తారని, సిగ్గు లేకుండా మంత్రి పదవులు ఇస్తారనీ, అసలు రాష్ట్రంలో ఉన్నది టిడిపి మంత్రివర్గమా, ఇతర పార్టీ మంత్రివర్గమా అర్థం కావడం లేదన్నారు. 
ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికినా స్పందించరు. ఎవరైనా మామూలు ఉద్యోగులు ఇలా దొరికితే వెంటనే వారిని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు.  మన ముఖ్యమంత్రి మాత్రం రాజీనామా చేయరు, డిస్ క్వాలిఫై కూడా కారు. ఇలాంటి స్థితిలో మనకు ఎలాంటి నాయకులు కావాలో ఆలోచించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మోసం చేసే ముఖ్యమంత్రి కావాలా, అబద్దాలు చెప్పేవారు ముఖ్యమంత్రి కావాలా ఆలోచించుకోవాలన్నారు. ఇటువంటి వారిని రాజకీయ వ్యవస్థ నుంచి బహష్కరించాలని, ఫలానాది చేస్తానని చెప్పి చేయని వారిని ఇంటికి పంపుతునే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుందని వైయస్ జగన్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నవరత్నాల గురించి ఆయన వివరించారు. 

Back to Top