చంద్రబాబు కొత్త ఎత్తుగడ

బాక్సైట్ తవ్వకాలకు బాబు యత్నాలు
ఆన్ లైన్లో ప్రజాభిప్రాయ సేకరణ  పేరుతో అడ్డదారులు
తమకు అనుకూలంగా ప్రకటన ఇప్పించుకునే కుట్ర
ఆదివాసీలకు అండగా వైఎస్సార్సీపీ పోరు తీవ్రతరం
ఈనెల 10న చింతపల్లికి వైఎస్ జగన్

విశాఖపట్నంః
చంద్రబాబు దోపిడీకి దొంగదారులు వెతుకుతున్నారు. బాక్సైట్ ను దోచుకునేందుకు
తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.  బాక్సైట్ తవ్వకాలను ఆదివాసీలు,
ప్రతిపక్షాలు,ప్రజాసంఘాలు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు ఏమాత్రం
లెక్కచేయకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. అక్రమ ధనార్జనే ధ్యేయంగా
గిరిజనుల పొట్టగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆన్ లైన్లో అభిప్రాయ
సేకరణ పేరుతో ప్రకటన విడుదల చేసి అక్కడి సంపదను లూటీ చేసేందుకు కొత్త
ఎత్తుగడ వేస్తున్నారు. 

బాక్సైట్ తవ్వకాలకు
అనుమతిస్తూ ప్రభుత్వం జీవో 97ను  జారీ చేయడంపై మన్యం భగ్గుమన్న సంగతి
తెలిసిందే. ఆదివాసీలకు అండగా వైఎస్సార్సీపీ బాక్సైట్ తవ్వకాలను
వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష పోరాటానికి దిగడంతో టీడీపీ ప్రభుత్వం
వెనక్కితగ్గింది. జీవోను తాత్కాలికంగా నిలుపు దల చేస్తున్నట్లు
ప్రకటింటింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి  నిరసనలు హోరెత్తడంతో
తనకు తెలియకుండా జీవో ఇచ్చారంటూ చంద్రబాబు ఆనెపాన్ని అధికారులపై నెట్టేవేసే
ప్రయత్నం చేశాడు. ఆటలు సాగకపోవడంతో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు
అవాస్తవాలను జోడించి శ్వేతపత్రం పేరుతో అబద్ధపు పత్రం రిలీజ్ చేశాడు. 
 
జీవోను
రద్దు చేయకుండా నిలుపుదల చేసిన చంద్రబాబు మరోసారి బాక్సైట్ తవ్వకాల కోసం
అడ్డదారులు తొక్కుతున్నాడు. బాక్సైట్ ను దోచుకునేందుకు ఆన్ లైన్ బాట
పట్టాడు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజన అభిప్రాయం కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ
చేపడుతామని చెప్పి వారిని బలవంతంగా నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆదివాసీలకు అందుబాటులో లేని అంతర్జాలంలో అభిప్రాయాలు చెప్పాలంటూ బురిడీ
కొట్టింటేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఆదివాసీల అభిప్రాయాలను
పక్కనబెట్టి ఆన్ లైన్లో తన అనుకూల ప్రకటనలు ఇప్పించుకునేందుకు చంద్రబాబు
సరికొత్త నాటకానికి తెరలేపాడు. 

చంద్రబాబు తన
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మన్యం సంపదను కొల్లగొట్టేందుకు కుయుక్తులు
పన్నుతున్నారు. గిరిజనుల హక్కులు కాలరాస్తూ రాజ్యాంగవ్యతిరేక చర్యలకు
పాల్పడుతున్నారు. ఐదవ షెడ్యూల్ లోని గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలు ఏర్పాటు
చేయాలి. గ్రామసభలు, గిరిజన సలహా మండలి తీర్మానం లేకుండా బాక్సైట్ తవ్వకాలు
జరపడం చట్టవ్యతిరేకం.  అయినా చంద్రబాబు చట్టాలను తుంగలో తొక్కుతూ
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. జీవోను శాశ్వతంగా రద్దు చేసేవరకు
పోరాడేందుకు గిరిజనుల పక్షాన వైఎస్సార్సీపీ పోరు తీవ్రతరం చేసింది.
 ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ
శ్రేణులు జీవోను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
ఈనెల 10న ఆదివాసీల్లో భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ చింతపల్లిలో
పర్యటించనున్నారు.  
Back to Top