రైతులను సీఎం వెన్నుపొటు పొడుస్తున్నాడు

దాచేపల్లి: మామను వెన్నుపోటు పోడిచి అధికారంను చేజిక్కిచుకున్న సీఎం చంద్రబాబు ఎన్నికల్లో రైతులకు అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు వెన్నుపొటు పొడుస్తున్నాడని వైయస్సార్‌ కాంగ్రె స్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగా మాట్లాడారు. రైతులు పండించిన మిర్చిపంటకు గిట్టుబాటుధర కల్పించటంలో సీఎం ఘోరంగా విఫలమైయ్యారని జంగా మండిపడ్డారు. మిర్చిపంటకు గిట్టుబాటు ధర లేకపోవటం వలన రైతులు పీకల్లోతు అప్పుల్లో కురుకుపోయారని, రైతులంటే సీఎంకు చిన్నచూపు అని ఆయన ఆరోపించారు. బహిరంగ మార్కెట్‌లో మిర్చికి గిట్టుబాటుధర లేదన్న విషయం సీఎంకు కూడా తెలుసునని... మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చీని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొకపోవటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికలప్పుడు చంద్రబాబు హామి ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు మేలు జరిగేలా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దళారులు, వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలకు లబ్ది చేయటం కోసమే క్వింటాకు రూ1500 పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారని, నిజమైన రైతులకు ఈ పరిహారం అందదని ఆయన ఆరోపించారు. రైతులకు అండగా ఉండకుండా వెన్నుపొటు పోడిచేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప రైతులకు అండగా ఉండేలా చర్యలు తీసుకోకపోవటం దారుణమన్నారు. కొల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేసిన మిర్చికి ఈ పరిహారం అందనని ప్రభుత్వం చెబుతుందని, ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న కొల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేసిన మిర్చికి కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌చేశారు. మిర్చి రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని, లేదంటే తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

మే1,2 తేదిలో జరిగే రైతు దీక్షను విజయవంతం చేయండి:
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తమ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 1, 2 తేదిల్లో గుంటూరులో రైతు దీక్ష చేస్తున్నట్లు జంగా తెలిపారు. ఈ దీక్షలో రైతులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జంగా వెంట పార్టీ మండల కన్వీనర్‌షేక్‌జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, పట్టణ కన్వీనర్‌మునగా పున్నారావు, బిసీ సెల్‌మండల కన్వీనర్‌బత్తుల బాలయ్య, సీనియర్‌నాయకులు ఉల్లేరు హనుమంతరావు, చిరంజీవి, వేముల శ్రీహరి, వేముల తిరుపతయ్య, బత్తుల బయ్యన్న, యలమారెడ్డి కొటిరెడిడ, దేరంగుల శ్రీనివాసరావు తదితరులున్నారు.
Back to Top