చంద్రబాబు పథకాలుతందానా అంటున్న వందిమాగధులుపచ్చమీడియాలోనూ పసలేని కథనాలుహైదరాబాద్ః ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఈ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య తగాదాగా మార్చి బైటపడాలని కుట్రపన్నుతున్నారు. చంద్రబాబు వందిమాగధులు ఈ వ్యవహారాన్ని అటువైపు మరల్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక చంద్రబాబుకు వంతపాడే పచ్చమీడియా కూడా అలాంటి కథనాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. చంద్రబాబు ఈ కొనుగోలు వ్యవహారంలో నేరుగా, సూత్ర ధారిగా మారాడన్న అంశాన్ని డైల్యూట్ చేయటానికి అన్ని ఎత్తుగడలూ తమ మీడియా ద్వారా అమలు చేస్తున్నారు. వ్యూహం పన్ని, వల పన్ని పట్టుకున్నారని; ట్యాపింగ్మీద అధికారం లేదని రకరకాల దివాలా కోరు వాదనలకు దిగారు. చివరికి ఏపీలో పోలీస్ స్టేషన్లలో తెలుగుదేశం వారు కేసులు పెట్టే స్థాయికి వెళ్ళారు. కుట్రకు సూత్ర ధారి అని సీఎం దొరికిపోతే, దొరికిన వాడు దొంగ కాదన్నట్టుగా, దొరే అన్నట్టుగా చూపటానికి ఇది తెలుగుజాతి సమస్య అనో, రాష్ట్రాల సమస్య అనో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడును తప్పించేందుకు చివరికి రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. దొంగదారులు వెతుకుతున్న బాబు...ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ఏడాది పాలనకు ముడి పెట్టడం అంటే దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న చేతగాని ప్రయోగమే ఇది. చంద్రబాబు ఏడాది పాలనలో ఏం ఘనత సాధించారని ప్రజలు పండుగ చేసుకుంటారు. ఈ విషయం తెలిసే నవ నిర్మాణ దీక్ష అంటూ పెట్టారు. ఏడాది బీజెపీతో కాపురం చేసి చివరకు రేవంత్ ఎపిసోడ్ బయటపడక ముందు చంద్రబాబు తేల్చింది ఏమిటంటే- ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేంద్రం నుంచి రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని. ఏడాది పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, రేవంత్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా తర్వాత కూడా బయట పడేందుకు ఇప్పుడు చంద్రబాబు మహా సంకల్పం అని, క్యాంపు కార్యాలయంలో పూజ అని తప్పించుకునేందుకు రకరకాలా దారులు వెతుకుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు....ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగటానికి అనర్హుడు. తక్షణం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. లేదా గవర్నరు ఆయన్ను బర్త్ఫ్ ్రచేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చంద్రబాబు నాయుడులో ఉన్నది పరిపాలనలో అనుభవజ్ఞుడు కాదని, అవినీతిలో ఈయనకున్నంత అనుభవం ఇంకెవరికీ లేదని గుర్తించాలి. అవినీతికి ఆది గురువు లాంటి ముఖ్యమంత్రిని పదవినుంచి దించాలి. మీడియాకు దూరంగా బాబురేవంత్ వ్యవహారం కేవలం తీగ మాత్రమే. ఈ తీగను పట్టుకుని లాగితే చంద్రబాబు డొంకంతా కదులుతుంది. అవినీతి విశ్వరూపం, చంద్రబాబు వికృత రూపాలు అన్నీ బయటపడతాయి. ఒక దోపిడీదారుకు, ఒక అత్యంత అవినీతిపరుడికి అధికారం ఇచ్చామా అని అఖిలాంధ్రప్రదేశ్ ప్రజలు నివ్వెరపోయి ఆయనను తక్షణం గద్దెదించే మహా సంకల్పానికి పూనుకొంటారు. కాబట్టే, చంద్రబాబు నాయుడు మీడియాను ఫేస్ చేయటానికి వెనకాడుతున్నారు. తన వందిమాగధులతో ప్రెస్మీట్లు పెట్టిస్తున్నాడు. చీటికీ మాటికీ ప్రెస్మీట్లు పెట్టే చంద్రబాబు గత కొన్ని రోజులుగా అధికార కార్యక్రమాల్లో తప్ప ఎక్కడా మీడియా ముందుకు రావటం లేదు. దొరికిపోయినపుడు దొంగ చెప్పే కబుర్లు...చంద్రబాబు తన సలహాదారుతో చెప్పించిన అంశాలు వింటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. దొరికిపోయినప్పుడు ఒక దొంగ చెప్పే అబద్ధాలన్నీ ఆ ప్రెస్మీట్లో చెప్పించారు. అందులో భాగంగానే- చివరికి అంతు చూస్తాం లాంటి పదాలు ఉపయోగించారు. చంద్రబాబు నాయుడి వాయిసే కాదన్నారు. ఆతర్వాత చంద్రబాబు నాయుడి సంభాషణలను అతికారన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఈ మూడూ పరస్పరం పొంతన లేని అంశాలు. చంద్రబాబు నాయుడు గొంతే కానప్పుడు మాటలను అతికే అవకాశం ఎక్కడిది? ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే మాటల్ని అతకాల్సిన ఖర్మ ఎందుకొస్తుంది? మాటల్ని అతికి ఉంటే చంద్రబాబు నాయుడు వాయిస్ కాకపోయి ఉంటే మరి ఈరోజున ఫోన్ ట్యాపింగ్ చేశారని టీడీపీ అధికారగణం అంతా ఎందుకు గొంతు చించుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా తమ పోలీసుల వద్దకు తమ కార్యకర్తల్ని పంపి ఊరూరా ఈ అంశంపై కేసులు ఎందుకు పెట్టిస్తున్నారు? మంత్రులందర్నీ తక్షణం హైదరాబాద్ వదిలి జిల్లాలకు వెళ్ళమని ఎందుకు ఆదేశించారు? అధికారంలో ఉన్న వ్యక్తే నిరసనలు, ధర్నాలు చేయండి అని ఎందుకు పిలుపునిచ్చారు? ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అడ్డంగా దొరికిపోయాడు. ఇది మొత్తం దాదాపు 100 కోట్ల రూపాయల డీల్. బయటకు వచ్చింది రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయటానికి చేసిన ప్రయత్నం మాత్రమే. ఇలా మరెంతమందితో డీల్ చేశారన్నది, ఎంత డబ్బు ఆఫర్ చేశారన్నది వెల్లడి కావాలి.