బాబుకు ప్ర‌చార పిచ్చిప‌ట్టింది: రోజా

చిత్తూరు: ప‌్ర‌తి కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు నాయుడు త‌న ప్ర‌చారానికి వాడుకుంటున్నార‌ని, వాటి కోసం కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమ‌ర్శించారు. పుష్క‌ర‌ఘాట్ల వ‌ద్ద క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌కుండా డ‌బ్బులు దండుకున్నార‌ని, ఇలాంటి స‌ర్కార్ ఏపీలో ఉండ‌డం మ‌న దౌర్భాగ్య‌మ‌న్నారు. ఎన్నో ఘాట్ల‌లో నీరు లేక‌పోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్నారు. పురాత‌న ఆల‌యాల‌ను కూల్చి మ‌రుగుదొడ్లు నిర్మించ‌డం దారుణ‌మైన చ‌ర్య‌గా ఆమె అభివ‌ర్ణించారు. రాజ‌ధాని విష‌యంలో త‌మ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేయ‌డం సిగ్గు చేట‌న్నారు.

Back to Top