నీ పాలన చూసి నవ్వుకుంటున్నారు..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేసిన పనులను తమవిగా చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి 80 శాతం పూర్తి చేశారని అన్నారు. హంద్రీనీవా కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.4 వేల కోట్ల నిధులు వెచ్చించి జీడిపల్లి వరకు నీళ్లు తెప్పించారని, అక్కడికెళ్లి ఫోటోలు దిగి అది తామే చేశామంటూ మంత్రులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

నధుల అనుసంధానం చేశామని చంద్రబాబు విదేశాల్లో చెప్పుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు సింగపూర్ జపం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని  చాంద్ బాషా విమర్శించారు. శ్రీశైలం రిజర్వాయర్ లో పూర్తిస్థాయి నీటిమట్టం లేకుండానే కిందికు నీళ్లు వదులడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రేమ వల్లే చేసుకుంటున్నారని వ్యంగ్యంగా మాట్లాడతారు. కరువుతో రైతు కూలీలు వలసలు పోతున్నా పట్టించుకోరు. హంగూ, ఆర్భాటాలు, ప్రగల్భాలు పలకడం తప్ప ప్రజల ప్రయోజనాలే పట్టడం లేదని పచ్చసర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top