మ‌హిళపై దాడి..జ‌రిగిందేదో జ‌రిగిపోయింది...!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు
స్పంద‌న అది. ప‌ట్ట ప‌గ‌లు విధినిర్వ‌హ‌ణ‌లో ఉన్న
ఒక మహిళా అధికారిని జుట్టు
ప‌ట్టి, అనుచ‌రుల‌తో ఈడ్పించి దాడి
చేస్తే, సెల్ ఫోన్ లాక్కొని
ధ్వంసం చేస్తే.. దాన్ని చాలా చిన్న  విష‌యంగా ముఖ్య‌మంత్రి సూత్రీక‌రించారు. అస‌లు అటువంటి
ఘ‌ట‌న‌లు
చాలా చిన్నవి అన్న‌ట్లుగా మాట్లాడారు.
ఇప్ప‌టికే దానిపై బాధితురాలితో
ఉద్యోగ సంఘాల‌తో మాట్లాడాన‌ని చెప్పుకొచ్చారు. అదే
స‌మ‌యంలో కూతురుపై
పోలీసుల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను అడ్డుకోబోయిన
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కేసుతో
దీన్ని పోల్చ‌లేమ‌ని
చంద్ర‌బాబు అభిప్రాయ ప‌డ్డారు. మొత్తం మీద మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే భ‌ద్ర‌త ఏపాటిదో తేల్చి
చెప్పేశారు.

Back to Top