చంద్రబాబు అండదండలతో రాష్ట్రం లూటీ..

విజయనగరంః అగ్రిగోల్డ్‌ బాధితుడ్ని చెంపదెబ్బ కొట్టడం చంద్రబాబు అసహనానికి పరాకాష్ట అని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. న్యాయం అడిగితే సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం వారి భౌతికంగా కొట్టడం అసమర్థతకు నిదర్శనమన్నారు.అధికార పార్టీ అవినీతిపై చాలా కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు. బ్యాంకులకు రూ.ఆరు వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన సుజనా దోపిడీ టీడీపీ నేతల అవినీతికి చిన్న ఉదాహరణ మాత్రమే అన్నారు. ఇలాంటి సుజనాలు,సీఎం రమేష్‌ లాంటివాళ్లు చాలా మంది ఉన్నారన్నారు.టీడీపీ నేతలది మొత్తం నాలుగున్నర లక్షల కోట్ల అవినీతి అని అన్నారు.చంద్రబాబు వెనుక అనేకమంది సుజనాచౌదరీలు ఉన్నారన్నారు.బాబు అండదండలతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నారు.దొరకని దొంగలు బాబు వద్ద చాలా మందే ఉన్నారన్నారు.
Back to Top