పీఏసీ ఛైర్మ‌న్ గా బుగ్గ‌న రాజా నియామ‌కం


హైద‌రాబాద్‌) చ‌ట్ట‌స‌భ‌ల‌కు సంబంధించిన  ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నిమాయకాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఆన‌వాయితీ ప్ర‌కారం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుడికే పీఏసీ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కుతుంది. మంత్రి స్థాయి హోదా తో ఈ ప‌ద‌వి ఉండ‌టంతో దీనికి ప్రాధాన్యం ఉంటుంది.  తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి మంచి అధ్య‌య‌న శీలిగా పేరు తెచ్చుకొన్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగ వ్య‌వ‌హారాల్ని సునిశితంగా ప‌రిశీలిస్తుంటారు. క‌ర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల పీఏసీ చైర్మన్ పదవికి రాజేంద్రనాథ్‌ రెడ్డి పేరును సిఫారసు చేశారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం ఆయన నియామకాన్ని ప్రకటించారు.
Back to Top