బొత్స కంచుకోటలో వైయస్‌ఆర్ సీపీ భేరి

విజయనగరం, 10 అక్టోబర్‌ 2012: పిసిసి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కంచుకోటల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి విశేష స్పందన లభిస్తోంది. పార్టీ సమీక్షా సమావేశాలకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. దీనితో పార్టీ పట్ల పలువురిలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
పార్టీ కార్యక్రమాల్లో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ విజయనగరం జిల్లాల్లో సమీక్షా సమావేశా‌లు నిర్వహిస్తోంది. పార్టీకి చెంది జిల్లా నాయకులు పెన్మత్స సాంబశివరాజు, కుంభా రవిబాబుతో పాటు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు గజపతినగరంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఈ‌ సమావేశాల్లో నిర్ణయించుకుంటున్నామని పార్టీ నేతలు చెప్పారు.

బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నర్సయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావడం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.‌

తాజా వీడియోలు

Back to Top