వైఎస్సార్‌సీపీలో చేరిన బొత్స

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి బొత్సను ఆహ్వానించారు. బేషరతుగా పార్టీలో చేరుతున్నట్టు పార్టీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ శనివారమే వెల్లడించిన సంగతి తెలిసిందే.

బొత్సతో పాటుగా ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పల నరసయ్య, బొత్స అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ తులసి, డీసీఎంఎస్ చైర్మన్ రమణరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి యడ్ల రమణమూర్తి, మాజీ జెడ్పీటీసీ ఉప్పాక సూర్యనారాయణ, డీసీసీ మాజీ చైర్మన్ పిల్లా విజయ్ కుమార్ లతో పాటుగా విజయనగరం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Back to Top