రోజాకు సుప్రీంకోర్టులో ఊరట

హైదరాబాద్: వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శాసనసభా పక్ష కార్యాలయంలోకి రోజాను అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎల్పీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో కూడా రోజా పాల్గొనవచ్చని పేర్కొంది.  


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజా అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు.  రోజా ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని,  స్పీకర్ కు ఈ లేఖ అందజేయాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. రెగ్యులర్ సెషన్స్ లో లేదా ప్రత్యేక సెషన్స్ లో ఆర్కే రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. శాసన సభ వ్యవహారాలకు కూడా రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. 

రోజా లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో మరోసారి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను ఆగస్టు తొలివారానికి వాయిదా వేసింది. 
Back to Top