<strong>నాలుగేళ్లలో ఉద్యోగాల భర్తీని గాలికొదిలేశారు..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి</strong>విజయనగరంః యువనేస్తం పేరుతో చంద్రబాబు మరోసారి యువతను మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులు 42 లక్షలు దరఖాస్తు చేస్తే చంద్రబాబు తనయుడు లోకేశ్ పది లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని అనడం దారుణమన్నారు.10 లక్షలకు గాను కేవలం 2లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వడం పచ్చిమోసమన్నారు. నిరుద్యోగ భృతిలో కోతలు పెట్టి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాలుగేళ్లలో ఉద్యోగాల భర్తీని గాలికొదిలేశారన్నారు. ప్రజలకు వాగ్దానభంగం చేయడంలో చంద్రబాబు మించిన ఘనుడు లేడరన్నారు..ఆరు వందల హామీలు ఇచ్చిన ఓట్లు వేయించుకుని ప్రజలను వంచించారన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చేశామంటూ ప్రచార్భాటం చేస్తున్నారని చెప్పారు. ఈ నాలుగున్నర ఏళ్లలో నిరుద్యోగ భృతి పైసా ఇవ్వని చంద్రబాబుకు ఎన్నికల సమయంలో గుర్తుకువచ్చిందా అని ప్రశ్నించారు. రూ..87 వేల కోట్ల రూపాయాలు రుణమాఫీ చేస్తానని రైతుల్ని నమ్మించి వారి జీవితాల్ని బుగ్గిపాలు చేశారని, అదేవిధంగా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి మోసగించారన్నారు. చంద్రబాబు నిరంతం అబద్ధాలతో బతుకుతూ ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారన్నారు.