చంద్రబాబు ప్రత్యేకహోదా ద్రోహి...

వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి


శ్రీకాకుళం: ప్రత్యేక హోదాపై శ్వేతపత్రం అబద్ధాల కరపత్రం అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా అవసరం లేదని,సంజీవని కాదన్న చంద్రబాబు ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారన్నారు. చంద్రబాబు ప్రత్యేకహోద ద్రోహి అని, పోలవరం ప్రాజెక్టును ప్రచారానికి వాడుకోవడం తప్ప చేసిందేమీలేదని మండిపడ్డారు. గేట్లు అమర్చడానికి కూడా కోట్ల రూపాయాలతో ప్రచారమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇవ్వబోయే మిగతా శ్వేత ప్రతాల్లో కూడా పచ్చి అబద్ధాలే ఉంటాయన్న సంగతి  అందరికి తెలుసునన్నారు. సామాజిక మాధ్యమాలు పెరగడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు.ఒక నీటి పారుదల ప్రాజెక్టును ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబే నిర్మిస్తున్నట్లుగా ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు.
Back to Top