<strong>కాకినాడః </strong>విద్యార్థి జీవితం నుంచి చంద్రబాబుకు వంచన అనేది రోజు వారి కార్యక్రమాల్లో భాగమని వైయస్‌ఆర్‌సీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నాడు కాంగ్రెస్ పార్టీని, అధికారమిచ్చిన ముఖ్యమంత్రులను వంచించారని, చేరదీసి కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచారని విమర్శించారు. విభజనకు మొగ్గుచూపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, సోనియాను ఇటలీ దెయ్యాయని అనేక విమర్శలు చేసిన చంద్రబాబు తిరిగి అదే పార్టీతో జతకట్టడం సిగ్గుచేటన్నారు.అనేక వాగ్ధానాలతో అధికారంలో వచ్చిన చంద్రబాబు ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు.ఏపీలో తాత్కాలిక భవనాలతో పాలన చేస్తున్నారని రాజధాని లేని రాష్ట్రంలో ఏపీని చేశాడని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ఏపీ రాజధానిగా హైదరాబాద్‌గానే ఉందని అమరావతి లేదన్నారు. రాజధానికి కనీసం పోస్ట్‌ల్ పిన్‌కోడ్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబు శాశ్వత ముఖ్యమంత్రి కాదని తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమేనని అన్నారు. నవ నిర్మాణదీక్ష పేరుతో బీజేపీతో నాలుగు సంవత్సరాలు అంటకాగారన్నారు. బీజేపీతో ఉండగా నవనిర్మాణ దీక్షలు చేపట్టిన చంద్రబాబు నేడు కాంగ్రెస్‌తో చేరి కొత్త దీక్షలు మొదలుపెట్టారని విమర్శించారు<br/>