బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారుకర్నూలు: బడుగు, బలహీనవర్గాలను మోసం చేస్తూ వారిని ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఆంధ్రరాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం బీసీల పట్ల మోసపూరిత విధానాలపై నిరసనగా నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ నాయకులు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, క్రర హర్షవర్ధన్‌రెడ్డి, గంగుల నాని, శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, దేశం సులోచన, సిద్దార్ధరెడ్డిలు పాల్గొన్నారు. 
కలెక్టరేట్‌ వద్ద..
టీడీపీ ప్రభుత్వం బీసీల పట్ల మోసపూరిత విధానాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బీవై రామయ్య ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో చెరుకులపాడు శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, ప్రదీప్‌రెడ్డి, నరసింహులుయాదవ్, తెర్నకల్‌ సురేందర్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top