కొత్త పొత్తుల కోసం బాబు వెంపర్లాట

 నెల్లూరు : ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ
చంద్రబాబు ఒక కొత్త పార్టీని వెతుక్కుంటారని హిందూపూర్ పార్లమెంటు కో ఆర్డినేటర్ నవీద్
మహమూద్ అన్నార. నెల్లూరు వంచన పై గర్జన సభలో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకు
బీజేపీతో అంటకాగి ఇప్పుడు.. రాజకీయ లబ్ధికోసం బయటకొచ్చి అదే బీజేపీని వైయస్‌ఆర్‌సీపీతో
జట్టు కట్టిందని గోబెల్స్‌ ప్రచారం చేయిస్తున్నారు. చంద్రబాబు ఏం చేయలేని దద్దమ్మ.
ప్రత్యేక హోదాను నీరు గార్చేందుకు నాలుగేళ్లు పోలీసులను ప్రయోగించి ఇప్పుడు
డ్రామాలాడుతన్నాడు. మొదట్నుంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పోరాడిన ఒకే
ఒక్క నాయకుడు మా జగన్‌మోహన్‌రెడ్డి. జగన్‌ నాయకత్వంలోనే ఏపీకి ప్రత్యేక హోదా
వస్తుంది. మా నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి జేసీ దివాకర్‌రెడ్డి
నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు. 25 మంది ఎంపీలను
గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదాను ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకొస్తారు. ప్రత్యేక
హోదా వస్తే ఉద్యోగాలొస్తాయ్‌.. పరిశ్రమలొస్తాయ్‌.. మన బతుకులు బాగుపడతాయ్‌. పక్క
రాష్ట్రాలతో పోటీ పడాలంటే మనకు ప్రత్యేక హోదా కావాలి. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ సీట్లిచ్చి తెలుగు దొంగల పార్టీ అంగడిని బంద్‌ చేయండి. తాను
వైయస్‌ఆర్‌సీపీలో మైనారిటీని కాదు. జగన్‌ సైన్యంలో ఒక సైనికుడినన్నారు. 

Back to Top