బాబును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి

  • ఆలీబాబ 40 దొంగలకు అధ్యక్షుడిగా చంద్రబాబు
  • టీడీపీ అంటే...తెగించి దోచుకునే పార్టీ 
  • విశాఖ భూకబ్జాలో పెదబాబు, చినబాబుల హస్తం ఉంది
  • భూ కుంభకోణాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిందే
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడః ఆలీబాబ 40 దొంగలకు అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ పార్టీ నేతలకు సూచించారు. లేకుంటే ప్రజలే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ అంటే...తెగించి దోచుకునే పార్టీగా మారిందని వెల్లంపల్లి మండిపడ్డారు. వాకాటి, దీపక్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు..వారిని పదవులను ఎందుకు తీసేయడం లేదని ప్రశ్నించారు. వారిని సస్పెండ్ చేసినంత మాత్రాన పునీతులవుతారా అని కడిగిపారేశారు. విశాఖ భూ కుంభకోణంపై ఓ మంత్రి తెలుగుదేశం నాయకుల మీద ఆరోపణలు చేస్తే..ఇంకో గాయన సీబీఐ ఎంక్వైరీ జరపమని వారికి వారే కోరుకోవడం...చంద్రబాబు చూస్తూ కూర్చోవడం పట్ల వెల్లంపల్లి మండిపడ్డారు.  భూదందాల మీద సీబీఐ ఎంక్వైరీ వేయమని మీ మంత్రులే చెబుతుంటే ఎందుకు వేయడం లేదని బాబును నిలదీశారు. విశాఖ భూ కబ్జాలో పెదబాబు, చినబాబు, గంటాల హస్తముందని శ్రీనివాస్ ఆరోపించారు. 

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన ఆర్థిక నేరస్తులు సుజనాచౌదరి, రాయపాటిలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని వెల్లంపల్లి బాబును నిలదీశారు. బాబు వేసిన త్రిసభ్య కమిటీ వల్ల ఆయన పార్టీకి ఉపయోగం గానీ, ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు.  ప్రజల ఆస్తులను దోచుకుంటున్న వారిని కాపాడేందదుకు, వాస్తవాల్ని కప్పిపుచ్చేందుకు బాబు పావులు కదుపుతున్నారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో ప్రథమ ముద్దాయే చంద్రబాబు అని వెల్లంపల్లి అన్నారు. జైలుకు పోయివచ్చిన రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ము నీకుందా బాబు అని సవాల్ విసిరారు. తామేం చేసినా ఎవరూ ఏం చేయలేరన్న అధికారమదంతో బాబు, లోకేష్ లు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. నగరంలోని  చోటా నాయకులు బుద్ధా వెంకన్నకు వైయస్ విజయమ్మ, విజయసాయిరెడ్డిల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. విశాఖలో విజయమ్మ గెలిచి ఉంటే నగర బ్రాండ్ కాపాడేవాళ్లు అని వెల్లంపల్లి అన్నారు. అధికారమిచ్చిన జిల్లాలో భూకబ్జాలు చేసి వేల ఎకరాలు దోచుకుంటూ, కాల్ మనీ కేసులో నిందితునిగా ఉన్న నీవా మాట్లాడేది అంటూ బుద్ధాపై మండిపడ్డారు. 

అమరావతి, పోలవరం, పట్టిసీమ, స్కీమ్ లపేరుతో లక్షలాది కోట్లు దోచుకుంటున్నారని టీడీపీ సర్కార్ పై వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. సుజనా, జేసీ, రాయపాటి, విశాఖ భూకుంభకోణంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే దమ్ముందా..? మీకు దమ్ముంటే సిట్ తో ముగించడం కాదు... నీతి, నిజాయితీ నిరూపించుకోవాలంటే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని బాబుకు వెల్లంపల్లి సవాల్ విసిరారు. వైయస్ఆర్ పై మీరు ఆరోపణలు చేసినప్పుడు మగధీరుడిలా ఎంక్వైరీ వేయించి నిజాయితీని నిరూపించుకున్నారని గుర్తు చేశారు. మీ తప్పులను కప్పుపుచ్చుకోవడానికే సీఐడీ, సిట్ ఎంక్వైరీలు వేస్తున్నారు తప్ప దాని వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదన్నారు. మాట్లాడితే ప్రెస్ మీట్ లు పెట్టే బాబు విశాఖ భూదందాపై ఎందుకు మాట్లాడడం లేదు..?తప్పుల లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదు..? అని ప్రశ్నించారు. దోపిడీ సర్కార్ పై  ఆఖరి వరకు పోరాటం సాగిస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. 
Back to Top