చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది


టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం దిగొచ్చేది
వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఢిల్లీః  వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా చేసి ఉంటే ఎప్పుడో కేంద్రం దిగొచ్చేదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ చేపట్టిన వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా ఏపీని విభజించిన సందర్భంలో  కాంగ్రెస్‌ ప్రత్యేకహోదాను కంటితుడుపుగా చర్యగా ప్రకటించి చట్టంలో చేర్చకుండా  మోసం చేసిందన్నారు. అనంతరం టీడీపీతో జోడి కట్టిన నరేంద్రమోదీ ఏపీకి వచ్చి ప్రత్యేకహోదాపై హామీ ఇచ్చి ఎన్నికలయిన తర్వాత పక్కన పెట్టారన్నారు.నరేంద్రమోదీ ప్రమాణాస్వీకారం చేయక ముందే  జగన్‌మోహన్‌ రెడ్డి కలిసి ప్రత్యేకహోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఆ రోజు మొదలుపెట్టిన పోరాటాలు, ధర్నాలు,వంటావార్పులు, నిరాహారదీక్షలు,యువభేరీలు వైయస్‌ఆర్‌సీపీ నిర్వహిస్తుందన్నారు. ప్రత్యేకహోదా లేకపోతే ఆంధ్రకు భవిష్యత్‌ లేదన్నారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఏనాడు కేబినెట్‌లో ప్రస్తావించలేదని, కుంటిసాకులు మాత్రం చెబుతారని ధ్వజమెత్తారు. కేంద్ర నిధులను తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారని, చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశ వాది అని అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే వైయస్‌ఆర్‌సీపీకి ముఖ్యమన్నారు. 25 ఎంపీలను గెలిస్తే మనం అనుకున్నది సాధించవచ్చన్నారు.

తాజా వీడియోలు

Back to Top