ఏపీని తెలంగాణకు తాకట్టుపెట్టిన బాబు

ఏపీ ప్రయోజనాలను గాలికొదిలేసిన బాబు
ఓటుకు కోట్లు భయంతో కేసీఆర్ కు దాసోహం
రాష్ట్ర హక్కుల కోసం వైయస్ జగన్ పోరాటం
ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడే యోధుడు
వైయస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యంః ఎమ్మెల్యేలు

కర్నూలుః తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష రెండో రోజు కొనసాగుతుంది. ఈసందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు దీక్షాస్థలికి చేరుకొని వైయస్ జగన్ కు మద్దతుగా నిలిచారు. ఈసందర్భంగా ప్రభుత్వ మోసపూరిత విధానాలపై నిప్పులు చెరిగారు. 

కేసీఆర్ కు తాకట్టు..
చంద్రబాబుకు ఓటుకు కోట్ల కేసు భయం పట్టుకుందని.. అందుకే ఆయన తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాయలసీమ పేరుతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కట్టి.. రూ. 600 కోట్ల సొమ్మును బాబు దోచుకున్నారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు బూచి చూపించే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని అన్నారు. చంద్రబాబుకు కావల్సింది ప్రజల బాగోగులు కాదని.. పదవి మాత్రమేనని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. సీఎం పదవి కోసం సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ఓటుకు కోట్ల కేసు నుంచి బయట పడేందుకు ఏపీని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని విమర్శించారు.

అడ్డగోలు అవినీతి
తెలంగాణ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా కేసీఆర్‌ను ప్ర‌శ్నిస్తే ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్తాడన్న భ‌యంతోనే చంద్ర‌బాబు నోరువిప్ప‌డం లేద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి విమ‌ర్శించారు. బాబు త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును తాక‌ట్టు పెట్టార‌ని ఆరోపించారు. విభ‌జ‌న‌తో అన్యాయానికి గురైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రాజెక్టుల‌తో తీవ్ర నీటి అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. దీనిని ఆపేందుకే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌ల‌దీక్ష చేప‌ట్టార‌ని వివ‌రించారు. నీరు చెట్టు కార్య‌క్ర‌మం పేరుతో బాబు రూ. 2500 కోట్ల‌ు తెలుగు త‌మ్ముళ్లకు దోచిపెట్టారని దుయ్య‌బ‌ట్టారు. రాయ‌ల‌సీమ‌కు నీరు ఇవ్వొద్ద‌ంటూ దీక్షలు చేసిన దేవినేని ఉమకు  రాష్ట్రమంత్రిగా కొన‌సాగ‌ే అర్హత లేదన్నారు. 

నిరంతర పోరాట యోధుడు
రాష్ట్రం ఎడారయిపోతుందని తెలిసి కూడా బాబు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. కేంద్రానికి, తెలంగాణకు బాబు ఏపీని తాకట్టు పెట్టారని విమర్శించారు.  రాష్ట్ర ప్రజల బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొని వైయస్ జగన్ జలదీక్ష చేపట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమించే శక్తి, సామర్థ్యాలు ఒక్క వైయస్ జగన్ కు మాత్రమే ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో బాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

సోనియానే ఎదిరించిన సింహం బిడ్డ
కృష్ణా, గోదావరిలపై అక్రమ కట్టడాలు కడుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి ఫైరయ్యారు. వైయస్ జగన్ కు ఉన్న విలువలు, విశ్వసనీయత బాబుకు ఒక్క శాతం కూడా లేవన్నారు. వైఎస్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించి...మామకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని నారాయణస్వామి ఫైరయ్యారు. ప్రతి ఒక్కరికీ మేలు చేసేవిధంగా అనేక సంక్షేమ  పథకాలు అందించి ప్రజల్లో దేవుడిగా నిలిచిపోయిన ఘనత వైయస్సార్ ది అని చెప్పారు.  సోనియాను, కాంగ్రెస్ నే ఎదిరించిన సింహం బిడ్డ వైయస్ జగన్ అని నారాయణస్వామి అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి చేసే వరకు నిరంతరం పోరాడుదామని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 

కాళ్లు పట్టుకొని పారిపోయారు
ప్రజలే దైవంగా భావిస్తూ ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పోరాడే నాయకుడు వైయస్ జగన్ అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండేళ్లుగా ఏపీ ప్రజలు నిరంతరం బాధపడుతున్నారని ఆర్కే చెప్పారు. చంద్రబాబు మాయమాటలు, అబద్ధపు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు వైయస్ జగన్ కు మొరపెట్టుకుంటున్నారని చెప్పారు.  ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించిన ఘనత వైయస్సార్ ది అయితే...కృష్ణా, గోదావరి డెల్టాలను ఎండబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను పక్కరాష్ట్రాలకు తాకట్టుపెట్టిన ఘనత బాబుదని అన్నారు.  ఆనాడు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్న బాబు..ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కాళ్లు పట్టుకొని విజయవాడకు పారిపోయాడని ఎద్దేవా చేశారు. 

To read this article in English:  http://bit.ly/23WT6tm 


Back to Top