<strong>ఢిల్లీః </strong>గత నాలుగున్నరేళ్ల నుంచి ఏపీకి ప్రత్యేకహోదా సాధించడం కోసం వైయస్‌ఆర్‌సీపీ అనేక ఉద్యమాలు చేసిందని వైయస్‌ఆర్‌సీపీ నేత కొలుసు పార్థరసారధి అన్నారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదే జంతర్‌మంతర్‌లో ధర్నా చేయడంతో పాటు పార్లమెంటు ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టినట్లు గుర్తుచేశారు.ప్రత్యేకహోదా ఇవ్వాలని, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు పర్చాలని వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమాలు, ధర్నాలు చేసిన పట్టించుకోకుండా బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు కుట్రలు చేసి ఏపీకి అన్యాయం చేశాయని మండిపడ్డారు.ఏపీలో మనకు ఎలాగు ఓట్లు లేవని.ఏపిపై ప్రత్యేక ప్రేమ ఎందుకని.. ఏపీకి ఇవ్వాల్సిన నిధులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చుపెట్టి పార్టీని బలోపేతం చేసుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తే.., బీజేపీ నిధులు ఇవ్వలేదనే సాకు చూపించి రాష్ట్రంలో నిర్మాణాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు,పెట్టుబడిదారులకు అప్పజెప్పి తద్వారా ముడుపులు సంపాదించుకోవడానికి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, చంద్రబాబు కలిసి ఏపీని పక్కదోవ పట్టించారన్నారు. <br/><br/> <br/>