ఏపీకి చంద్రబాబు తీవ్ర ద్రోహం


ఢిల్లీః ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రత్యేకహోదా కోసం నాలుగున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తుందన్నారు. ఏపీకి చంద్రబాబు తీవ్ర  ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపారన్నారు. చంద్రబాబుకు ప్రజా స్వామ్యం మీద విశ్వాసం లేదన్నారు. కేవలం కమీషన్ల కోసమే పోలవరాన్ని చంద్రబాబు చేపట్టారన్నారు. రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోవడానికి కారణం చంద్రబాబే కారణమన్నారు.రాష్ట్రం విడిపోవడానికి, తెలంగాణలో కూటమి ఓడిపోవడానికి కారణం చంద్రబాబే అన్నారు.రాజన్న రాజ్యం కావాలంటే వైయస్‌ జగన్‌ వల్లే సా«ధ్యమని అన్నారు.
Back to Top