అంబేద్కర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు...


దళితులు,గిరిజనులపై టీడీపీ వివక్షత...
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, కళావతి..

శ్రీకాకుళంః టీడీపీ హయాంలో దళితులు,గిరిజనులు వివక్షతకు గురయ్యారని వైయస్‌ఆర్‌సీపీ గిరిజన ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి,కళావతి  అన్నారు. చంద్రబాబు పాలనలో దళితుల దాడులు పెరిగాయన్నారు.చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దళితులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రాజధానిలో మూడేళ్ల క్రితం 125 అడుగుల అంబేద్కర్‌  విగ్రహాన్ని పెడతామని చెప్పి శంకుస్థాపన చేశారని, కాని నేటికి ఒక ఇటుక కూడా పడలేదన్నారు. అంబేద్కర్‌ను ఓట్లు కోసమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ ఆశయాలకు,రాజ్యాంగానికి తూట్లు పోడుస్తున్నారు. దివంగత నేత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో గిరిజనులు మంచి జరిగిందన్నారు.ఆయన హయాంలో దళితులు,గిరిజనులుక సముచిత స్థానం కల్పించారు. అదేవిధంగా అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి రాజన్న తనయుడు వైయస్‌ జగన్‌  అని అన్నారు. గిరిజనులకు న్యాయం జరగాలంటే వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు.

తాజా వీడియోలు

Back to Top