ఎన్నికలొస్తున్నాయని దళితులపై కపట ప్రేమ

నాలుగున్నరేళ్లుగా దళిత జాతిని కించపరించింది చంద్రబాబే
మహాతనే వైయస్‌ఆర్‌ పాలనలోనే దళిత సంక్షేమం
మళ్లీ ఆయన తనయుడు వైయస్‌ జగన్‌తోనే సాధ్యం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున

కాకినాడ: సీఎం చంద్రబాబుకు దేవుడు అంటే భయం, భక్తి ఉండదని, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని, హోదా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టి, తల్లిదండ్రులను బెదిరించి ఉద్యమాన్ని నీరుగార్చడని మండిపడ్డారు. పట్టువదలని విక్రమార్కుడిలా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ హోదా ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారన్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు  హోదా అంటూ కొత్త నాటకానికి తెరతీశాడన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని కొల్లగొడుతూ మట్టి, ఇసుక సహజ వనరులను కూడా బుక్కేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడిపై మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నాడన్నారు. నాలుగు సంవత్సరాల్లో దళితులపై అనేక దాడులు చేశారని ధ్వజమెత్తారు. దళితుల భూములు ఎన్ని లాక్కున్నావు.. ఎన్ని కేసులు పెట్టించావో చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లు దళితులను పక్కనబెట్టి ఎన్నికలు వస్తున్నాయని దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నాడన్నారు. 

దళిత సంక్షేమాన్ని కోరిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని మేరుగు నాగార్జున గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో దళిత, గిరిజన, మైనార్టీ సంక్షేమం విరాజిల్లింది. చట్టాలన్నీ చంద్రబాబు చుట్టాలుగా మార్చుకుంటున్నాడని ధ్వజమెత్తారు. దళిత, గిరిజన, మైనార్టీ, బడుగుల సంక్షేమం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమన్నారు. చంద్రబాబు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పల్లెలకు వచ్చే టీడీపీ నాయకులను నిలదీయాలని కోరారు. 
Back to Top