బాబు యాత్ర టిడిపి అంతిమయాత్ర: వైయస్‌ఆర్‌ సిపి

గుత్తి (అనంతపురం జిల్లా), 8 అక్టోబర్‌ 2012: అధికార దాహంతో చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న పాదయాత్ర తెలుగుదేశం పార్టీ అంతిమయాత్ర అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు‌ అభివర్ణించారు. జనంలోకి వెళుతున్న బాబుకు, టిడిపికి ఇదే వారి మధ్యకు వెళ్ళేందుకు ఇదే చిట్టచివరి అవకాశం అని వారు ఎద్దేవా చాశారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల కుట్రలకు మన రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ‌ఐదు వేల మందికి అన్నదానం నిర్వహించారు. 

గుత్తి పట్టణంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌పార్టీ ఎమ్మెల్యేలు వైయస్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. టీడీపీ, కాంగ్రె‌స్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా జగ‌న్మోహన్‌రెడ్డి నిర్దోషిగా ప్రజల ముందుకు వస్తారన్నారు. చంద్రబాబు మీ కోసం పాదయాత్ర, టీడీపీకి అంతిమ యాత్ర అవుతుందంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.  ప్రజల ముందుకు వచ్చి ఒక సారి ముఖం చూపించి పోవడానికే చంద్రబాబు వచ్చారన్నారు. భవిష్యత్తులు టిడిపి నామరూపాలు లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ప్రజలను కలవడానికి బాబు చేస్తున్న ఇవే చివరి ప్రయత్నాలని వారు వ్యాఖ్యానించారు. చంద్రబాబు  ప్రయత్నాలు ఆ పార్టీని ఇకపై కాపాడలేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఆ పార్టీని భూ స్థాపితం చేస్తాయని ఎమ్మెల్యేలు అన్నారు‌.

ప్రజలను అనేక విధాలుగా దోచుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్నదని అనంతపురం ఎమ్మెల్యే గుడివాడ గురునాథరెడ్డి పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రజా సమస్యనూ పరిష్కరించాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఆ పని చేయకుండా తప్పించుకుంటోందని ఆయన ఆరోపించారు. జనాన్ని మోసం చేయడమే మీ ఎజెండాగా మీ కోసం పేరుతో పాదయాత్రకు బయలుదేరిన చంద్రబాబు నాయుడు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు ఆయనకు పట్టం కట్టే పరిస్థితి లేదన్నారు.

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల స్ర్కి‌ప్టు ప్రకారమే సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోందని ఎమ్మెల్యే అకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు.  వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేత, రాజంపేట ఎమ్మెల్యే అమ‌ర్‌నాథ్‌రెడ్డి. సోనియా అల్లుడిపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు దర్యాప్తు చేయడంలేదని ప్రశ్నించారు. వైయస్ జగ‌న్‌ను ఒక్కడినీ చేసి కుట్రలు చేస్తున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని అమర్‌నాథ్‌రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కాని, ఆయనకు వత్తాసు పలుకుతున్న పత్రికలయితేమో ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఆ అబద్ధాన్ని పలుమార్లు చెప్పి నిజం చేయాలని దురాలోచనతో ఉన్న వ్యక్తులని విమర్శించారు. జగన్‌కు 5వ తేదీన బెయిల్‌ వస్తే చంద్రబాబు పాదయాత్ర కావచ్చు, ముఖ్యమంత్రి చేసే ఇందిరమ్మ బాట కావచ్చు. రెండూ వెలవెల పోతాయని భయపడిపోయి జగన్‌కు బెయిల్‌ రాకుండా కుట్ర చేసిన విషయం వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు.

 ఇకపైన మరింత రెట్టించిన ఉత్సాహంతో‌ విజయమ్మ నాయకత్వంలో ప్రజా సమస్యలపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top