రెండేళ్లుగా వేత‌నాలు ఇవ్వ‌డం లేదు



చిత్తూరు:   ప్ర‌భుత్వం త‌మ‌కు  రెండేళ్లుగా త‌మ‌కు వేత‌నాలు ఇవ్వ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆయుష్ ఎన్ఆర్‌హెచ్ఎం పారా మెడిక‌ల్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా బుధ‌వారం ఆయుష్ ఉద్యోగులు చిత్తూరు జిల్లా చింత‌ప‌ర్తి వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ..  త‌మ‌ను పారా మెడికల్ ఉద్యోగులుగా నియమించిన ప్ర‌భుత్వం వైద్యులు లేర‌ని వేత‌నాలు ఇవ్వ‌డం లేద‌న్నారు.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆయుష్ వైద్య పోస్టుల‌ను భ‌ర్తీ చేసేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేయాల‌ని కోరారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న ప్ర‌తిప‌క్ష నేత ఈ విష‌యంపై ప్ర‌భుత్వంతో పోరాటం చేస్తామ‌ని, అప్ప‌టికి దిగిరాక‌పోతే మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక మేలు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం ఆయుష్ ఉద్యోగులు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తు తెలిపారు. 
Back to Top