నిరాశ్రయులను ఆదుకోండి

శ్రీకాకుళం : జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో 150 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు, వైద్య శిబిరాలకు వెచ్చించాలని డిమాండ్‌ చేశారు. వ్యాధుల బారిన పడిన గిరిజనులకు రక్త పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గిరిజన గ్రామాల్లో అంటువ్యాధులపై అవగాహన కల్పించాలని కోరారు.  దోమలపైదాడి ప్రకటనలకే పరిమితం చేయకుండా నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని డిమాండ్‌ చేశారు.

Back to Top