<strong>నెల్లూరుః</strong> గత ఎన్నికల్లో బూటకపు వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. నేనొక్కడినే నిజాయతీ పరుడిననే విధంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే ఈ నాలుగేన్నర ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణకు చంద్రబాబు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అవినీతి పెరిగిపోయిందన్నారు. ఇసుక,మట్టి,గనులు అన్ని టీడీపీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. ఇంత అవినీతి జరుగుతున్నా తమ అనుకూల పత్రికల్లో ఏపీలో అవినీతి తగ్గిందని రాయిస్తారని విమర్శించారు.