అవినీతిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత బాబుదే

అనంతపురం(పెనుకొండ) : చంద్రబాబు పాలనా వైఫల్యాలను ఎండగడతామని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఇందు కోసం ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి గడపగడపకూ వైయస్సార్‌సీపీ కార్యక్రమం చేపడుతామన్నారు. అవినీతిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో బెల్టు షాపులు తీసేస్తామని ప్రకటించి అధికారం చేపట్టగానే ప్రతి గ్రామంలోనూ అవినీతి దుకాణాలు తెరిచారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై వంద అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించామని, దీనిని ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.  సమావేశంలో బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది భాస్కరరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సర్పంచ్ సుధాకరరెడ్డి, సరస్వతమ్మ చంద్రారెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితా శ్రీనివాసరెడ్డి, పార్టీ బీసీసెల్ జిల్లా నాయకులు కొండలరాయుడు, బోయ నరశింహ, బోయబాబు, జాఫర్, సోమశేఖరరెడ్డి, శంకరరెడ్డి, యాసిన్, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Back to Top