మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌శ్రీ‌కాకుళం: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి  సమక్షంలో శ‌నివారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకొని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఆయ‌న వెంట  టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో పార్టీలో చేరారు. అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు శాసనసభ్యునిగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ సంద‌ర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ..నాయకునికి రాజకీయ విలువలు ముఖ్యమని,   ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడికి సూచించినా విన‌కుండా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించార‌న్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున  గెలిచిన‌ ముత్తుముల అశోక్‌రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధ‌మ‌న్నారు. చంద్ర‌బాబు తీరు న‌చ్చ‌క‌ విలువలు లేని పార్టీలో తాను కొనసాగలేక టీడీపీకి రాజీనామా చేశాన‌ని చెప్పారు.  ఆయన వెంట గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యనేతలు చెంగయ్య చౌదరి, నరసింహ నాయుడు, అక్కి పుల్లారెడ్డి, కె.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు మౌలాలి, మారం రెడ్డి రామనారాయణరెడ్డి, చదుల్ల వెంకట రమణారెడ్డి, కామూరి రమణారెడ్డి, షేక్‌ సుభాని తదితరులు ఉన్నారు.   

తాజా వీడియోలు

Back to Top