వైయస్ జగన్ ను సీఎం చేయడమే లక్ష్యం

హైదరాబాద్ః  వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని,  అందుకు మా శక్తివంచన లేకుండా కృషి చేయాలనే ఉద్దేశ్యంతో అనుచరులతో కలిసి పార్టీలో చేరినట్టు అనకాపల్లి కాంగ్రెస్ నేత దిలీప్ కుమార్ తెలిపారు.  విశాఖ జిల్లాలో గుడివాడ అమర్నాథ్ కు సంపూర్ణ సహకారం అందించి,  వైయస్సార్సీపీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. వైయస్ జగన్ సమక్షంలో దిలీప్ కుమార్ తన అనుచరులతో కలిసి వైయస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరందరికీ వైయస్ జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తామని దిలీప్ కుమార్ అన్నారు. 

Back to Top