'అమ్మఒడి' పథకం ఇందుకే!

హైదరాబాద్, 20 అక్టోబర్‌ 2012 : షర్మిల తన పాదయాత్రలో నేరుగా జనం కష్టాలను తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో ప్రజాప్రస్థానం సాగిన దారంట అంతటా జనం తాము పడుతున్న కడగండ్లను ఆమెకు వివరించారు.
కత్తులూరు పంచాయతీకి చెందిన మల్లకాని సిద్దయ్య కొడుకు శివ పాములూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాదయాత్ర సాగుతుండగా గొర్రెలు కాస్తూ కనిపించాడు. ఆ పిల్లాడితో షర్మిల సంభాషణ ఇలా సాగింది.

షర్మిల: ఏం చిన్నా.. గొర్రెలు కాస్తున్నావ్?

శివ (కన్నీళ్లతో): మా నాన్నకు బాగోలేకుంటే నేను కాపలాకు వచ్చా. స్కూలుకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి. ఇక్కడ తిండి లేదు. పశువులకు మేత కూడా లేదు. అమ్మకు చెవుడు. పెన్షన్ కూడా రాదు. నాన్నకు బీపీ, షుగర్. పనికి వెళ్లలేడు. అన్న జేసీబీ మీద పనిచేస్తాడు. నాన్న బ్యాంకుకు వెళితే కనీసం లోను కూడా ఇవ్వలేదు.

షర్మిల: చూశారుగా.. ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా? చిన్న పిల్లాడు. చదువుకోవాల్సిన వయసు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. జగనన్న ఇలాంటి పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం తెస్తానని చెప్పాడు. పిల్లలను బడికి పంపితే తల్లులకు నెలకు రూ.500 చొప్పున సాయం చేసే పథకం అది. ఏ సాయం చేయని ఈ ప్రభుత్వం మనకు అవసరమా?

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top