అంబేడ్క‌ర్‌..బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ విగ్ర‌హాల ఆవిష్క‌ర‌ణ‌

క‌ర్నూలు: క‌ర్నూలు న‌గ‌రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యం వ‌ద్ద‌ నూత‌నంగా ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్‌, బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ విగ్ర‌హాల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజ‌య్య ఆవిష్క‌రించారు. శ‌నివారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అంబేడ్క‌ర్‌, జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. దేశం కోసం వారు చేసిన సేవ‌ల‌ను ఐజ‌య్య కొనియాడారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, ద‌ళిత సంఘాల నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.

Back to Top