హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కాళ్లు పట్టుకుని బయటపడాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. బీజేపీ నేతలకు సైతం సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్కు ఎందుకు వచ్చారని, కేసీఆర్, చంద్రబాబుల మధ్య రాయబారానికా అని అంబటి ప్రశ్నించారు.<br/>తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయినా, టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పదే పదే బాస్ అంటూ చెప్పిన పేరు చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఈ విషయంపై చంద్రబాబు సూటిగా ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటికైనా తప్పు అంగీకరించాలని అంబటి డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.<iframe src="http://www.sakshi.com/video/embed-player/id/31534?&autoplay=0&pWidth=750&pHeight=400&category=embed" width="750" height="400" frameborder="0" scrolling="no"/>