బాబు క్యాబినెట్ అంతా శాడిస్టులే

  • నారా ఫ్యామిలీలోనే అల్జీమర్స్ వ్యాధి ఉంది
  • బాబు, మంత్రులు కేంద్రానికి అమ్ముడుపోయారు
  • ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తైన హోదాను తాకట్టుపెట్టారు
  • ప్రత్యేకహోదా కోసం వైయస్ జగన్ వీరోచిత పోరాటం
  • బాబు, మంత్రులకు పిచ్చిపట్టి ప్రతిపక్ష నేతపై కారుకూతలు కూస్తున్నారు
  • నోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ హెచ్చరిక

విజయవాడః చంద్రబాబు నాయుడు క్యాబినెట్ అంతా శాడిస్టుల క్యాబినెట్ ల తయారైందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ...  ఆర్కే బీచ్ లో విద్యార్థుల క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన వైయస్ జగన్ ను ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసి దుర్మార్గంగా వెనక్కి పంపించారని బాబు సర్కార్ పై మండిపడ్డారు. వైయస్ జగన్ కు మానసిక వ్యాధి ఉందంటూ మంత్రులు చేసిన కామెంట్స్ పై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, మంత్రులకు పిచ్చిపట్టిందని విశాఖపట్నంలో అందరినీ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాల్సిందేనని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని, చెప్పిందే చెప్పి మమ్మల్ని చంపుతున్నాడని మీ క్యాబినెట్ సహచరులే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రెండ్రోజుల పాటు కలెక్టర్ల మీటింగ్ పెట్టి పాడిందే పాటరా పాసుపళ్ల దాసరా అంటూ బాబు తమను మానసిక క్షోభ పెడుతున్నారని, ఇప్పుడు చెప్పింది అర్థగంట తర్వాత మర్చిపోతున్నాడని  ఐఏఎస్ లు అన్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. నారావారి వంశంలోనే అల్జీమర్స్  వ్యాధి ఉందని,  నారా రామ్ముర్తి నాయుడు హాస్పిటల్ పాలయ్యాడు. బావమరిది బాలకృష్ణ ఓ వ్యక్తిని హత్యకు గురిచేసినప్పుడు మానసిక రోగం ఉందని సర్టిపికెట్ తెచ్చుకున్న దాఖలాలున్నాయని అన్నారు. ఒకసారి హోదా సంజీవని అని, మరోసారి హోదా ఏమైనా సంజీవనా అంటూ బాబు మాట్లాడుతున్నారని, ఆయనకు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా..లేక మతి తప్పి మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు. బాబు మానసిక పరిస్థితిపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. ప్యాకేజీ వస్తే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, మంత్రులకు డబ్బులు వస్తాయే తప్ప విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏమీ రావని అన్నారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు అయిన ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి అమ్ముడుపోయిన మీరా వైయస్ జగన్ గురించి మాట్లాడేది అంటూ చంద్రబాబు, సహచర మంత్రులపై విరుచుకుపడ్డారు.

ప్రత్యేకహోదా కోసం వీరోచితంగా పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పై మంత్రులు కారుకూతలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.  విశాఖ ఎయిర్ పోర్టులో ఉన్నది పోలీసులో, టీడీపీ గుండాలో తెలియది. రన్ వే పైనే ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం దారుణమన్నారు. బాబు విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల్ని కాలరాస్తున్నాడని ధ్వజమెత్తారు. హోదా అంటే జైల్లో పెట్టండి అంటూ బాబు అరాచకత్వం ప్రదర్శిస్తున్నారని, విద్యార్థులు ఏం పాపం చేశారని కేసులు, అరెస్ట్ లతో బెదిరిస్తున్నారని  మండిపడ్డారు.  మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదాను తీసుకురాలేక బాబు, లోకేష్,  క్యాబినెట్  కేంద్రానికి అమ్ముడుపోయారని ఆగ్రహించారు.  ప్రాణాలు సైతం పణంగా పెట్టి వైయస్ జగన్  హోదా కోసం పోరాడుతుంటే మంత్రులు షాడిస్టుల్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడుకు ఒళ్లంతా కొవ్వే ఉందని తగ్గించుకోవాలని సూచించారు. దేవినేని ఉమ కాదు దద్దమ్మ ఉమ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేడు గానీ మాటలు కోటలు దాటిస్తున్నాడని మండిపడ్డారు. లోకజ్ఞానం తెలియని నారాయణ కూడా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.  మీరు గెలవలేరు అంటూ రావెల మాట్లాడుతున్నారని...మా పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారని, చీము నెత్తురు ఉంటే మీ ముఖ్యమంత్రిని ఒప్పించి వాళ్ల చేత రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలో వైయస్ జగన్ సత్తా ఏంటో, బాబు సత్తా ఏంటో తేలుతుందని అన్నారు.  ఇప్పటికే రాజీనామా చేయించాలని ఎన్నోసార్లు సవాల్ చేసినా టీడీపీకి దమ్మూ, దైర్యం లేకపోయిందని ఎద్దేవా చేశారు.  ప్రత్యేకహోదా కోసం పోరాడకపోగా, అందుకోసం ఉద్యమిస్తున్న ప్రతిపక్ష నేతకు సహకరించేది పోయి తిట్టే కార్యక్రమం చేయడం దారుణమన్నారు. ఎట్టిపరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు క్షమించరని బాబు బృందాన్ని హెచ్చరించారు. హోదా కోసం డిమాండ్ చేయడం తప్పా? హోదా పేరు ఎత్తితే కేసులు , అరెస్ట్ లు, జైళ్లకు పంపుతున్నారు...? ఇంత దుర్మార్గమా...? మీ నాయకత్వంలో మేం ఢిల్లీ వస్తామని జగన్ ప్రకటన చేస్తే సిగ్గుగా లేదా బాబు? అన్ని పార్టీలను పిలవండయ్యా..? హోదా వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని వైయస్ జగన్ చెప్పినా బాబు వినిపించుకోవడం లేదన్నారు. మలేషియా, సింగపూర్, జపాన్, దావోస్ కు వెళ్లి స్టాల్స్ కొనుక్కోని బతిమిలాడాల్సిన పనిలేదు.... హోదా వస్తే దేశ, విదేశాలనుంచి  రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెడతారు, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని అన్ని పార్టీలు, మేధావులు చెబుతున్నా బాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  ఐదుకోట్ల మంది భవిష్యత్తు ప్రత్యేకహోదాపైనే ఆధారపడి ఉందని, వైయస్ జగన్ నాయకత్వంలో స్పెషల్ స్టేటస్ సాధించేవరకు పోరాటం చేస్తామన్నారు. 

చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైంది
వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు.  చంద్రబాబు కాబినేట్‌ సమావేశాల్లో, కలెక్టర్ల మీటింగుల్లో చెప్పిన విషయాలే చెప్పి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బాబుకు మతిమరుపు ఎక్కువైంది, 66 ఏళ్లు వయసు కావడంతో ఆయనకు చాదస్తం రోజు రోజుకు శృతి మించుతోందని ధ్వజమెత్తారు. అలాంటి పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసిన టీడీపీ నేతలు ఇప్పుడేందుకు మాట మార్చారని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసం, కేసులు మాఫీ చేసుకునేందుకు చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించారని ఆరోపించారు. మంత్రులు దేవినేని ఉమా, రావెల కిశోర్‌బాబు, అచ్చెన్నాయుడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీలోకి చేర్చుకున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు రావాలని వెల్లంపల్లి సవాల్‌ విసిరారు. మాకు ప్రత్యేక హోదా వద్దని ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని నిలదీశారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చిన  ప్రజల సత్తా ఏంటో చూపుతున్నారని టీడీపీ నేతలను హెచ్చరించారు. విశాఖలో సీఐఐ సదస్సు పేరుతో తెల్లపేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు మేలు చేసే చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్‌ సూచించారు.


Back to Top