ఎమ్మెల్సీ అభ్యర్దుల గెలుపు పై హర్షం

నిండ్ర ;  చిత్తూరు జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన బాలసుబ్రమణ్యంకు, అదే విధంగా పట్టభ‌ద్రుల‌ అభ్యర్ధి యండుపల్లి శ్రీనివాసులురెడ్డిలు గెలుపోందడంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌ కార్యదర్శి చక్రపాణి రెడ్డి హర్షం వ్య‌క్తం చేశారు. బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పార్టీ నాయ‌కులు , కార్యకర్తలు కలసి మన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్దులను గెలిపించుకోవడం అభినందించ‌ద‌గ్గ విష‌యం అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మనోహర్‌నాయుడు, మురళినాయుడు, నాగభూషణంరాజు, శ్యామ్‌లాల్, మేరి, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు

Back to Top