రోజాకు ఆదినారాయ‌ణ‌రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాలి

విశాఖః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై  మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ పట్ల విశాఖ జిల్లా వైయ‌స్ఆర్ సీపీ మ‌హిళా నేత‌లు మండిప‌డ్డారు. మంత్రి వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న నిర్వ‌హించారు. రోజాపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఆదినారాయ‌ణ‌రెడ్డికి వ్య‌తిరేకంగా ఫ్ల‌కార్డులు ప‌ట్టుకొని, న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలిపారు. మంత్రి, రోజాకు క్ష‌మాప‌ణ చెప్ప‌ని ప‌క్షంలో విశాఖ వ‌చ్చిన‌ప్పుడు చెప్పులు, చీపుర్ల‌తో స్వాగ‌తం ప‌లుకుతామ‌ని హెచ్చ‌రించారు. 

Back to Top