వైయస్సార్సీపీ కార్పొరేటర్ పై ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి

వైయస్ఆర్ కడపః టీడీపీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఎర్రగుంట్లలో ఆదినారాయణరెడ్డి వర్గీయులు వైయస్సార్సీపీ కార్పొరేటర్ పై దాడికి తెగబడ్డారు. ఆదినారాయణ రెడ్డి వైయస్సార్సీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడం అనైతికమని కార్పొరేటర్ సుబ్బారెడ్డి ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారు. నిరసనగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, జమ్మలముడుగు నియోజకవర్గ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి ఎర్రగుంట్ల పీఎస్ వద్ద బైఠాయించారు. వైయస్సార్సీపీ కార్పొరేటర్ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Back to Top