న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 8వ సారి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ అప్పటికే పోడియం వద్దకు వెళ్లిన అన్నాడీఎంకే ఎంపీలు.. కావేరి బోర్డు ఏర్పాటుచేయాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలుమార్లు చేసిన విజ్ఞప్తులు విఫలం కావడంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. <br/>