70 మంది ఎమ్మెల్యేలు రెడీ!

విజయవాడ 22 నవంబర్ 2012 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 70 మంది ఎమ్మెల్యేలు
సిద్ధంగా ఉన్నారని వైయస్ఆర్ సీపీ కృష్ణాజిల్లా కన్వీనర్
సామినేని ఉదయభాను అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కాలేదని రుజువు చేసుకోవడం కోసం చంద్రబాబు
'అవిశ్వాస తీర్మానం' పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఒక వైపు తుగ్లక్ పాలన అని విమర్శిస్తూనే మరోవైపు 'అవిశ్వాసం' పెట్టడానికి చంద్రబాబు ఎందుకు వెనకాడు తున్నారని ఆయన
ప్రశ్నించారు.

Back to Top