5న రాష్ట్రపతిని కలవనున్నవైయ‌స్ఆర్‌సీపీ నేతలు

 న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం సోమవారం కలవనుంది. ఈ మేరకు వైయ‌స్ఆర్‌సీపీ  ఓ ప్రకటన విడుదల చేసింది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు. 
ప్రతిపక్ష నాయకులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈ నెల 25న విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జ‌రిగిన విష‌యం విధిత‌మే. ఈ త‌రువాత వైయ‌స్ జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుప‌త్రిలో శ‌స్త్ర చికిత్స‌ల అనంత‌రం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఏపీ ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం లేక థ‌ర్డ్ పార్టీతో విచార‌ణ చేయించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఇప్ప‌టికే దేశ రాజ‌ధానికి వెళ్లి కేంద్ర హోం మంత్రి, వివిధ పార్టీల నాయ‌కుల‌ను కోరారు. ఈ నెల 5వ తేదీ రాష్ట్ర‌ప‌తిని క‌లువ‌నున్నారు.
Back to Top