జగన్మోహన్ రెడ్డి సీఎం కావాల్సిందే

రాజానగరం:

దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం పనిచేసిన మహానుభావుడని తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన శతాధిక వృద్ధురాలు పేకల చెల్లమ్మ కొనియాడారు. తిరిగి ఆయన పాలన రావాలంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. రాజన్న కుమారుడికి ఓటేసేందుకే నేను బతికున్నానని  ఆమె  చెప్పారు. శ్రీ జగన్‌ జన్మదినం పేదలకు పండుగరోజులాంటిదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన వరదానమ్మ తన ఇంటివద్ద శ్రీ జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్‌చేసి చుట్టుపక్కల ఇళ్లవారికీ, స్కూల్ విద్యార్థులకూ పంపిణీ చేశారు. నీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక నా భర్త మరణిస్తే నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మా ఇంటికొచ్చి ఓదార్చావు.. మమ్మల్ని ఆపదలో ఆదుకున్నావు. నీవు నిండు నూరేళ్లు వర్ధిల్లు... కుట్రలు, కుతంత్రాలు అశాశ్వతం. విశ్వసనీయత, ఆదరణ, ఆత్మీయత ఎప్పటికీ నిలిచి ఉంటారుు. త్వరలోనే జనం మధ్యకి వస్తావు.. నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆమె శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు.

Back to Top