40 ఇయర్స్‌ ఇండస్ట్రీ వచ్చినా చర్చ జరగలేదు


హోదా అంటే జైల్లో పెట్టి.. ఇప్పుడు కాళ్లు పట్టుకుంటావా
నీ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు
ఇప్పటికైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసిరా
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ఢిల్లీ: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఢిల్లీకి రావడంతో అవిశ్వాసం చర్చకు వస్తుందని భావించామని, అయినా చర్చ జరగలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీకి వచ్చి లోక్‌సభ సెంట్రల్‌ హాల్లో స్వీట్లు తింటూ ఇతర పార్టీ నేతలతో ముచ్చట్లు పెడుతూ కాలక్షేపం చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌ ఆవరణలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారందరినీ జైల్లో పెట్టించి ఇప్పుడు మళ్లీ హోదా కావాలంటూ అందరి కాళ్లు పట్టుకుంటే నిన్ను ఎవరు నమ్ముతారు చంద్రబాబూ.. నీ నీచ బుద్ధి అందరూ గ్రహించారన్నారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చివుంటే వైయస్‌ఆర్‌ సీపీతో కలిసి రావాలన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీలమంతా 6వ తేదీన రాజీనామాలు చేస్తున్నామని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి మాతో కలిసి రావాలని కోరారు. అందరం కలిసి రాజీనామాలు చేస్తే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top