రెండో రోజుకు చేరిన ఎంపీల ఆమ‌ర‌ణ దీక్ష‌

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదిక‌గా చేప‌ట్టిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష శ‌నివారం రెండో రోజుఉకు చేరుకుంది. ఏపీ భ‌వ‌న్‌లో ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు శుక్ర‌వారం ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టారు. కాగా, మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి అస్వ‌స్థ‌త‌కు గురైనా దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. ఎంపీల దీక్ష‌కు మద్ద‌తుగా శుక్ర‌వారం రాత్రి రాష్ట్ర‌వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. వైయ‌స్ జ‌గ‌న్ కూడా గుంటూరు జిల్లాలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొని మ‌ద్ద‌తు తెలిపారు. హోదా సాధనే లక్ష్యంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగిన వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీలకు ప్రజలు బాసటగా నిలిచారు. పార్లమెంట్‌ వేదికగా కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేసి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన ఎంపీలకు మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది.

 YSRCPYS Jagan Mohan Reddyhigh court lawyers

Back to Top