రెండోరోజూ కొనసాగుతున్న వైయస్‌ఆర్‌సీపీ దీక్షలు



తిరుపతిః ఏపీ వ్యాప్తంగా  వైయస్‌ఆర్‌సీపీ నిరుద్యోగ విద్యార్థి విభాగం 48 గంటల దీక్షలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల దీక్షా శిబిరాలు తొలగించి పోలీసులు పలువురి విద్యార్థి నేతల్ని అరెస్ట్‌ చేశారు. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వలేదని నిరుద్యోగులు ధ్వజమెత్తారు. యువనేస్తం పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా భృతి చెల్లించాల్సి ఉందన్నారు. బేషరతుగా నెలకు రూ.2వేలతో పాటు బకాయి మొత్తం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి ఎస్వీయూలో రెండోరోజు దీక్షలు కొనసాగుతున్నాయి.రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, హరిప్రసాద్‌ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి నేత మెంటాడ స్వరూప్, 20 మందిని అరెస్ట్‌ చేశారు.
 
Back to Top