24 నుంచి శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పాద‌యాత్ర‌క‌ర్నూలు:  వైయ‌స్ఆర్‌సీపీనంద్యాల పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఈ నెల 24వ తేదీ నుంచి శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు.  ఈ నెల 24న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 3వేల కి.మీ మైలురాయి చేరుకోనున్న  సందర్భంగా ఆత్మకూరులో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. 24,25,26 తేదీల్లో శ్రీశైలం నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతామన్నారు. 27న శ్రీశైలం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు.
Back to Top