200ల మంది టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక

మలికిపురం (రాజోలు): రెండు వందల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామానికి చెందిన గుబ్బల అభిమన్యుడు, ఉక్కునూరి రామకృష్ణ, కోరశిక సత్యనారాయణ, గొర్ల రాంబాబు, శనకం కాటంరాజు, గుబ్బల పెద్దిరాజు, పొన్నపల్లి రామేష్, సావిత్రి, గూడపల్లి రమణ, వెలదూరటి రమేష్‌లతో పాటు మరో 200ల మంది పార్టీలో చేరారు. నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ కోఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు, సీనియర్‌ నాయకుడు రుద్రరాజు వెంకట్రామరాజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
Back to Top