అవినీతి బాబుకు రూ.200 కోట్ల ముడుపులు

హైదరాబాద్: అగ్రిగోల్డ్ నుంచి చంద్రబాబునాయుడు రూ.200 కోట్ల ముడుపులు తీసుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులు ఈ ఉదయం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆమె మాట్లాడుతూ...కోర్టులో కేసు నడుస్తుండగానే మంత్రులే భూములు కొనడం సిగ్గుచేటన్నారు. వాస్తు, గెస్ట్హౌస్, సెవెన్ స్టార్ హోటళ్లకు రూ.100 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్న బాబుకు 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల గోడు పట్టదా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్న  చంద్రబాబుపై నమ్మకం లేదని..కనీసం తెలంగాణ సీఎం కేసీఆర్ అయినా అగ్రిగోల్డ్ పై స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని ఆమె కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. 

Back to Top